విద్యుత్ వైర్లు తగిలి మంటలు.. బూడిదైన గడ్డి, ట్రాక్టర్..

ABN , First Publish Date - 2020-12-27T14:26:25+05:30 IST

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు ట్రాక్టర్, గడ్డి అగ్నికి బూడిదయ్యాయి.

విద్యుత్ వైర్లు తగిలి మంటలు.. బూడిదైన గడ్డి, ట్రాక్టర్..

వనపర్తి జిల్లా: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ట్రాక్టర్, గడ్డి అగ్నికి బూడిదయ్యాయి. మంటలు ఎగిసిపడడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. వనపర్తి జిల్లా, వీపనగండ్ల మండలం, పుల్లరచర్లలో ఈ ఘటన చోటు  చేసుకుంది. రైతు రాఘవేంద్ర యాదవ్ పొలం నుంచి ట్రాక్టర్‌పై గడ్డి తరలిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డి, ట్రాక్టర్ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. 1978లో పాతిన విద్యుత్ స్తంభాలు కావడంతోనే విద్యుత్ వైర్లు కిందికి వాలాయని రైతులు ఆరోపించారు. విద్యుత్ వైర్లుతో ప్రమాదముందని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. పట్టించుకోలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త విద్యుత్ స్తంభాలు పాతాలని కోరారు.

Updated Date - 2020-12-27T14:26:25+05:30 IST