రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకే కేసీఆర్ కృషి: వంశీచంద్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-08-11T19:12:30+05:30 IST
హైదరాబాద్: రాయలసీమను రతనాల సీమగా చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లుందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: రాయలసీమను రతనాల సీమగా చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లుందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి తెలిపారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసే చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను అడ్డుకోవడంలో ప్రభుత్వ తీరుపై సందేహాలున్నాయన్నారు. కేసీఆర్‌కు రాష్ట్ర ప్రయోజనాల కంటే కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారన్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చర్చకు రాకపోతే కేసీఆర్ కాంట్రాక్టర్ల ప్రతినిధిగా పనిచేస్తున్నారనే ఆరోపణలు నిజమని స్పష్టం అవుతోందని వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు.