వాస్తవాలను బయటపెట్టిన ఆంధ్రజ్యోతి: వంశీచంద్

ABN , First Publish Date - 2020-07-28T22:38:52+05:30 IST

తెలంగాణలో కరోనా మరణాలపై వాస్తవాలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సాహసోపేతంగా ప్రసారం చేసిందని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ

వాస్తవాలను బయటపెట్టిన ఆంధ్రజ్యోతి: వంశీచంద్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మరణాలపై వాస్తవాలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సాహసోపేతంగా ప్రసారం చేసిందని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా మరణాలపై ఆంధ్రజ్యోతి కథనాలను విశ్వశిస్తున్నట్లు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ప్రకటించారు. కరోనా విషయంలో కోర్టు మొదటి నుంచీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తోందన్నారు. తక్కువ టెస్టులు చేయడం, మృతదేహాలకు టెస్టులు చేయకపోవడం, డాక్టర్లకు పీపీఈ కిట్లు ఇవ్వకపోవడంపై ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టిందని గుర్తు చేశారు. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని వంశీచంద్ ధ్వజమెత్తారు.

Updated Date - 2020-07-28T22:38:52+05:30 IST