మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వడ్డెర సంఘం నేతలు
ABN , First Publish Date - 2020-12-28T19:48:02+05:30 IST
వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు వల్లెపు మొగిలి తదితరులు మినిస్టర్స్ క్యాంప్ కార్యాలయంలో

హైదరాబాద్: వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు వల్లెపు మొగిలి తదితరులు మినిస్టర్స్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో ఒడ్డెర్లు ఎదుర్కొంటున్న సమస్యలపైనా, వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, వడ్డెరలు చాలా వెనుకబడి ఉన్నారని మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో వడ్డెర సంఘం జాతీయ కోశాధికారి బత్తుల లక్ష్మి కాంతయ్య, రాష్ట్ర యువజన అధ్యక్షులు వల్లెపు శివకుమార్, కార్యదర్శి మధు, స్వామినాథన్, ఖమ్మం నరసయ్య తదితరులు ఉన్నారు.