అంబేద్కర్‌ కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధం: వీహెచ్

ABN , First Publish Date - 2020-04-15T01:32:52+05:30 IST

అంబేద్కర్‌ కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధం: వీహెచ్

అంబేద్కర్‌ కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధం: వీహెచ్

హైదరాబాద్: లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారంటూ కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంపై వీహెచ్ మాట్లాడారు. ‘‘నేను ఒక్కడినే వెళ్లి నివాళులర్పించా. మెట్లెక్కి వెళ్లలేదు. కింద నిల్చుని అంబేద్కర్‌ పాదాల వద్ద పూలు చల్లాను. అంబేద్కర్‌ విగ్రహం వద్దకు వెళ్తే కేసు పెట్టడం అన్యాయం. వరంగల్‌లో వినయ్‌భాస్కర్‌, సిద్దిపేటలో హరీశ్‌రావు కూడా అంబేద్కర్‌ విగ్రహాలకు నివాళులర్పించారు. వారిపై కేసులు పెట్టరా ?.. అంబేద్కర్‌ జయంతికి 40మందికి అనుమతి ఇవ్వాలని సీఎంకు లేఖ రాశా, స్పందించలేదు..అంబేద్కర్‌ కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమని’’ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-04-15T01:32:52+05:30 IST