కరోనా పరీక్షల్లో సర్కారు దాపరికం
ABN , First Publish Date - 2020-04-21T09:40:15+05:30 IST
కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాపరికానికి పాల్పడుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

హెల్త్ బులెటిన్‌పై అనుమానాలున్నాయి
పెద్ద ఎత్తున పరీక్షలు జరిగితేనే వాస్తవాలు వెల్లడి
టీపీసీసీ ముఖ్యనేతల సమావేశంలో ఉత్తమ్, ఖుంటియా
హైదరాబాద్/నేరేడుచర్ల/హుజూర్‌నగర్,ఏప్రిల్21(ఆంధ్రజ్యోతి): కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాపరికానికి పాల్పడుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సర్కారు ప్రకటిస్తున్న హెల్త్ బులెటిన్‌పై అనేక అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద ని అన్నారు. ప్రతిరోజూ ప్రత్యేక బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి లక్షమందికి కేవలం 37 మం దికే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
పరీక్షలు పెద్ద ఎత్తు న జరిగితేనే వాస్తవాలు వెల్లడవుతాయని అభిప్రాయపడ్డారు. కరో నా సాయంపై పీసీసీ ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో సోమవారం ఖుంటియా, ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి లో పేదలకు అందాల్సిన సాయంపై బుధవారం కలెక్టర్లను కలిసి వినతిపత్రా లు సమర్పించాలని ఆదేశించారు. ప్రభు త్వం నుంచి సాయం అందని పేదలకు పార్టీ తరపున సహాయకార్యక్రమాలు చేపట్లాలని సూచిం చారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలను టీఆర్‌ఎస్ నేతలు.. పార్టీ కార్యక్రమాల్లాగా చేస్తున్నారని, దీనిపై అధికార పార్టీ ముద్ర లేకుండా చూడాలని సూచించారు. వీడి యో కాన్ఫరెన్స్‌లో పొన్నం, కొండా సురేఖ, బోసురాజు, శ్రీనివా్‌సకృష్ణన్, శ్రావణ్ పాల్గొన్నారు.
ప్రైవేటులో ఎందుకు జరపరు?
ఇతర రాష్ట్రాల్లో ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెస్టింగ్ లు జరుగుతుంటే తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో విలేకరులతో మాట్లాడుతూ లాక్‌డౌన్ పొడిగింపును తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. సీఎం ప్రెస్‌మీట్‌లు పెట్టడం, గొప్పలు చెప్పుకోవడం, జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే వారిని బెదిరించ డం తప్ప.. చెప్పేదానికి, చేసే దానికి పొంతన లేదని విమర్శించారు. అనంతరం హమాలీలు, ఆశా కార్యకర్తలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
ర్యాపిడ్ టెస్టులు చేయకపోతే కోర్టుకు: గూడూరు
కరోనా కు ఇప్పటికైనా ప్రభుత్వం అందరికీ ర్యాపిడ్ టెస్టులు చేయించాలని, లేదంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ నేత గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. ప్రైవేటు పరీక్షా కేంద్రాల్లో టెస్టులు చేయించుకోకుండా ఆపడం ప్రజల హక్కులను కాలరాయడమేనన్నారు. కాగా, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి పౌరసరఫరాల శాఖకు విడుదల చేసిన రూ.300 కోట్ల నిధులను తిరిగి వెనక్కు తీసుకునేలా కార్మిక శాఖను ఆదేశించాలంటూ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌కు కాంగ్రెస్ నేత రాములు నాయక్ ఫిర్యాదు చేశారు. కార్మికుల సంక్షేమ బోర్డు విభజన జరగకుండా నిధులెలా విడుదల చేస్తార ని ప్రశ్నించారు. 300 కోట్లను వెనక్కు తీసుకుని, మరో రూ.500 కోట్లు కలిపి కార్మికులకు ఆహారం, షెల్టర్ కల్పించాలని, ఒక్కొక్కరికి రూ.2 వేలు సాయం చేయాలని కోరారు.