ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి: ఉత్తమ్

ABN , First Publish Date - 2020-03-22T01:23:09+05:30 IST

ఆదివారం ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వస్తున్నవారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు.

ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి: ఉత్తమ్

హైదరాబాద్: ఆదివారం ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వస్తున్నవారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం చర్యలు మరింత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా నియంత్రణపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-03-22T01:23:09+05:30 IST