బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుట్రపూరితంగా అసత్య ప్రచారం: ఉత్తమ్‌

ABN , First Publish Date - 2020-11-03T16:19:41+05:30 IST

దుబ్బాక ఎన్నికలను ప్రభావితం చేయడానికి కొందరు దుర్మార్గులు యత్నిస్తున్నారని

బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుట్రపూరితంగా అసత్య ప్రచారం: ఉత్తమ్‌

హైదరాబాద్: దుబ్బాక ఎన్నికలను ప్రభావితం చేయడానికి కొందరు దుర్మార్గులు యత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నిక బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నారని అసత్యప్రచారం చేస్తూ.. ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో పెట్టారన్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.


సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఉత్తమ్‌ అన్నారు. ఓడిపోతామన్న భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుట్రపూరితంగా అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డి  నీతి నిజాయితీగల వ్యక్తి అని అన్నారు. పోలింగ్ 7 గంటలకు ప్రారంభమవుతున్న సమయంలో ఈ ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో పెట్టారని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే అయితే దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు మేలు జరుగుతుందని ఉత్తమ్ అన్నారు.

Updated Date - 2020-11-03T16:19:41+05:30 IST