హైదరాబాద్‌లో అర్బన్‌ జిల్లా బీజేపీ నాయకుల అరెస్టు

ABN , First Publish Date - 2020-09-12T09:20:13+05:30 IST

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో

హైదరాబాద్‌లో అర్బన్‌ జిల్లా బీజేపీ నాయకుల అరెస్టు

తెలంగాణ విమోచన  దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌


మట్టెవాడ, సెప్టెంబరు 11: తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్‌కు శుక్రవారం వెళ్లిన వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో పాటు పలువురు నాయకులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్ద అరెస్టు చేసిన తరువాత వారిని ముషీరాబాద్‌, బేగంబజార్‌, గోశామహల్‌ స్టేడియంకు తరలించారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడతూ బీజేపీ ప్రజాస్వామికంగా చేసే నిరసనలను రాష్ట్ర సర్కార్‌ అప్రజాస్వామికంగా అడ్డుకుంటుందని ఆరోపించారు. ఎంఐఎం నేతల మెప్పు కోసం సీఎం కేసీఆర్‌ నిజాం నియంతలా మారాడని ఆరోపించారు.


ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి ఏనుగల రాకేష్‌రెడ్డి, బీజేఈవైఎం అధ్యక్షుడు సిద్దం నరేష్‌,  కూచ న క్రాంతి, గురుమూర్తి శివకుమార్‌, కొలను సంతోష్‌రెడ్డి, దశిని సదానందం గౌడ్‌, అమర్నాద్‌రెడ్డి, వినోద్‌, కందకట్ల సత్యఆరాయణ, మండల సురేష్‌, జన్ను మధు, పుల్యాల రవీందర్‌రెడ్డి, కూచన క్రాంతి, నాంపల్లి శ్రీనివాస్‌లను అరెస్టు చేశారు. రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, రేవూరి ప్రకాష్‌డ్డి, వన్నాల శ్రీరాములును హౌస్‌ అరెస్టు చేశారు. 

Updated Date - 2020-09-12T09:20:13+05:30 IST