4న యూపీఎస్సీ ప్రిలిమినరీ

ABN , First Publish Date - 2020-10-03T23:11:50+05:30 IST

ఆదివారం యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో 99 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షకు 46,171 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

4న యూపీఎస్సీ ప్రిలిమినరీ

హైదరాబాద్‌: ఆదివారం యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో 99 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షకు 46,171 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. యూపీఎస్సీ ప్రాథమిక పరీక్షను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 4న జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ ఏడాది పరీక్ష ఎవరికి చివరి అవకాశంగా ఉంటుందో అభ్యర్ధులకు అదనపు ప్రయత్నం చేయడాన్ని పరిశీలించాలని బెంచ్ యూపీఎస్సీని కోరింది. పరీక్ష వాయిదా కోసం 20 మంది సివిల్ సర్వీస్ ఆశావహులు పిటిషన్ దాఖలు చేశారు.

Updated Date - 2020-10-03T23:11:50+05:30 IST