కార్మిక చట్టాల నిలిపివేత ఆర్డినెన్స్‌ సరికాదు

ABN , First Publish Date - 2020-05-11T09:59:41+05:30 IST

ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ర్టాల్లో మూడేళ్ల పాటు కార్మిక చట్టాలను నిలిపివేస్తూ తీసుకువచ్చిన ..

కార్మిక చట్టాల నిలిపివేత ఆర్డినెన్స్‌ సరికాదు

  • ఉపసంహరించుకోవాలి: పౌరహక్కుల సంఘం  

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ర్టాల్లో మూడేళ్ల పాటు కార్మిక చట్టాలను నిలిపివేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ నిర్ణయాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది. కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. కరోనా వ్యాప్తి పేరుతో కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడమేంటని ప్రశ్నించింది. కార్మిక చట్టాలను నిలిపివేయడం భారత రాజ్యాంగంలోని జీవించే హక్కును హరించివేయడమేనని తెలిపింది. మూడు రాష్ర్టాల్లో చట్టాల నిలిపివేత అంతర్జాతీయ కార్మిక సంస్థ మౌలిక సూత్రాలకు విరుద్థంగా ఉందని పేర్కొంది.

Updated Date - 2020-05-11T09:59:41+05:30 IST