కరోనాను నివారించొచ్చు.. అధ్యాపకురాలి సంచలన ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-03-28T22:11:21+05:30 IST

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి సాధ్యమైనవరకూ అరికట్టే టీకాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(యూఓహెచ్)కి చెందిన ఓ

కరోనాను నివారించొచ్చు.. అధ్యాపకురాలి సంచలన ఆవిష్కరణ

హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి సాధ్యమైనవరకూ అరికట్టే టీకాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(యూఓహెచ్)కి చెందిన ఓ అధ్యాపకురాలు కనిపెట్టింది. దీనికి టీ-సెల్ ఎపిటోమ్ అని నామకరణం చేసింది. అయితే దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన వచ్చేందుకు శాస్త్రవేత్తలతో చర్చలు జరుపుతామని యూనివర్సిటీ సిబ్బంది తెలిపింది.


సీమా మిశ్రా, బయోకెమిస్ట్రీ విభాగంలో పని చేస్తున్న ఈమె.. కరోనా వైరస్ కారణంగా మానవ శరీరంలో చెడిపోయిన కణాలను అంతం చేసేందుకు అణుమాత్రం శక్తి కలిగిన మరో కణాలను సృష్టించింది. అయితే ఇప్పడు ఇది పరిశోధన దశలో మాత్రమే ఉంది. ఈ కణాల కారణంగా మానవ శరీరంలో ఆరోగ్యవంతంగా ఉన్న కణాలకు ఎటువంటి హాని జరుగదని యూనివర్సిటీ హామీ ఇచ్చింది. అయితే దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధన జరిగిన తర్వాతే ఇది అమలులోకి వస్తుందా.. రాదా.. అనే విషయంలో స్పష్టత రానుంది. 


‘‘ప్రస్తుతం సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనా వైరస్‌ని అరికట్ట వచ్చు. ఈ పరిశోధన పూర్తిస్థాయిలో విజయవంతం కావడానికి కొంత సమయం పడుతుంది. మా సిబ్బంది పూర్తిస్థాయిలో కృషి చేసి వీలైనంత త్వరగా కరోనాకు విరుగుడు కనిపెడతామని ఆశిస్తున్నాము’’ అని యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. 

Updated Date - 2020-03-28T22:11:21+05:30 IST