విశ్వవిద్యాలయ స్థాయికి ‘చైతన్య’ చేరడం అభినందనీయం
ABN , First Publish Date - 2020-09-03T10:41:37+05:30 IST
చైతన్య విద్యాసంస్థలు విశ్వవిద్యాలయ స్థాయికి చేరడం అభినందనీయమని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
నయీంనగర్, సెప్టెంబరు 2: చైతన్య విద్యాసంస్థలు విశ్వవిద్యాలయ స్థాయికి చేరడం అభినందనీయమని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హన్మకొండ కిషన్‌పురలోని చైతన్య డీమ్డ్ టు బీ యూ నివర్సిటీని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కళాశాల చైర్మన్ డాక్టర్ సీహెచ్‌వీ పురుషోత్తంరెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ముఖ్య అతిథిగా ఆన్‌లైన్‌లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. చైతన్య విద్యాసంస్థ డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదగడం సామాన్య విషయం కాదన్నారు.
మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చైతన్య కళాశాల ఒక సాధారణ డిగ్రీ కళాశాల నుంచి యూనివర్సిటీ స్థాయికి చేరడం ప్రశంసనీయమన్నారు. చైతన్య కళాశాలల చైర్మన్, యూనివర్సిటీ కులపతి పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. చైతన్య యూనివర్సిటీని భవిష్యత్‌లో ఒక ప్రామాణిక విశ్వవిద్యాలయంగా రూపొందిస్తామని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, విశ్వభారతి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ సీహెచ్ సువర్ణదేవి, కో చైర్‌పర్సన్స్ ఇనుగాల విక్రమ్‌రెడ్డి, డాక్టర్ సాత్విక, చైతన్య యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జి.దామోదర్, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ ఎం.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.