‘ఆత్మనిర్బర్‌ భారత్‌ అభియాన్‌’కు అదనంగా రూ.61,500 కోట్లు

ABN , First Publish Date - 2020-09-16T09:17:30+05:30 IST

ఆత్మనిర్బర్‌ భారత్‌ అభియాన్‌ పథకం కింద దేశంలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి ..

‘ఆత్మనిర్బర్‌ భారత్‌ అభియాన్‌’కు అదనంగా రూ.61,500 కోట్లు

టీఆర్‌ఎస్‌ సభ్యుడు బండ ప్రకాశ్‌ ప్రశ్నకు కేంద్రం జవాబు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):  ఆత్మనిర్బర్‌ భారత్‌ అభియాన్‌ పథకం కింద దేశంలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి అదనంగా రూ.61,500 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం టీఆర్‌ఎస్‌ సభ్యుడు బండ ప్రకాశ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబిచ్చారు. ఆత్మనిర్బర్‌ భారత్‌ పథకం ద్వారా అతి తక్కువ వ్యయంతో ఉత్పత్తి అయ్యే సౌరశక్తి విద్యుత్తు ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ సభ్యుడు  బి.లింగయ్య యాదవ్‌ అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు.

Updated Date - 2020-09-16T09:17:30+05:30 IST