ఎన్నికల్లో లబ్ధి కోసమే కేసీఆర్ భయపెడుతున్నారు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-11-26T22:03:50+05:30 IST

ప్రజలను భయపెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఎన్నికల్లో లబ్ధి కోసమే కేసీఆర్ భయపెడుతున్నారు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: ప్రజలను భయపెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. దుబ్బాక ఎన్నిక సమయంలోనూ మంత్రి కేటీఆర్ కూడా ఇలానే చేసి విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్, కేటీఆర్ పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లపై అక్బర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్బర్ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.


Updated Date - 2020-11-26T22:03:50+05:30 IST