కేంద్రం కరెంటు పిడుగు... వినియోగదారులపై పెనుభారం

ABN , First Publish Date - 2020-05-08T21:43:29+05:30 IST

పేదలు, రైతులపై మరోమారు విద్యుత్తు పిడుగు పడనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు చట్ట సవరణ 2020 ముసాయిదా బిల్లు లోని అంశాలు రాష్ట్రంలోని పేదలు, రైతుల విద్యుత్తు సబ్సిడీలకు గండంగా మారనున్నాయి. చివరకు గృహ విద్యుత్తు వినియోగదారులు... ప్రత్యేకించి అల్పాదాయ వర్గాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లోని పేదలపై విద్యుత్తు ఛార్ఝీలు పిడుగులా పడనున్నాయి.

కేంద్రం కరెంటు పిడుగు... వినియోగదారులపై పెనుభారం

హైదరాబాద్ : పేదలు, రైతులపై మరోమారు విద్యుత్తు పిడుగు పడనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు చట్ట సవరణ 2020 ముసాయిదా బిల్లు లోని అంశాలు రాష్ట్రంలోని పేదలు, రైతుల విద్యుత్తు సబ్సిడీలకు గండంగా మారనున్నాయి. చివరకు గృహ విద్యుత్తు వినియోగదారులు... ప్రత్యేకించి అల్పాదాయ వర్గాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లోని పేదలపై విద్యుత్తు ఛార్ఝీలు పిడుగులా పడనున్నాయి.


ముసాయిదా... కార్యాచరణలోకి వస్తే వ్యవసాయ రంగంలో పంపుసెట్లకు మీటర్లు రాబోతున్నాయి. ఇదే జరిగితే ఇక రైతు లకు మళ్లీ సంక్షోభం తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం... ప్రస్తుతం 25 లక్షల పంప్‌సెట్ల కోసం రూ. 5 వేల కోట్లు ఉచిత విద్యుత్తేు కింద ఇస్తోంది. గృహ వినియోగదారులకు రూ. 1,500కోట్ల దాకా సబ్సిడీ ఇస్తోంది. వీటన్నింటికి మంగళం పాడే దిశగా కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకూ విద్యుత్తు పై ఉన్న అధికారాలన్నీ... చట్ట సవరణలు కార్యరూపంలోకి వచ్చినపక్షంలో... కేంద్రానికే దఖలు కానున్నాయి.


విద్యుత్తు విషయంలో రాష్ట్రాలకున్న హక్కులను ఏకపక్షంగా తన ఆధీనంలోకి తీసుకునే దిశగా కేంద్రం విద్యుత్తు చట్ట సవరణ ముసాయిదాను రాష్ట్రాల అభిప్రాయాల కోసం పంపింది. ఈ చట్టంలోని అంశాలను పరిశీలిస్తే... రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి నియామకాల నుంచి పీపీఏలు, వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీలు, విద్యుత్తు ధర వంటి అంశాలపై విచక్షణాధికారాలన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోందని విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని దీనిపై అవసరమైతే ఎంతకైనా వెళ్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇటీవల జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో కేంద్రంపై బహిరంగంగానే నిరసన గళం విప్పిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలోనే... రాష్ట్రాల్లో కేంద్ర విద్యుత్తు చట్ట సవరణ బిల్లుపై చర్చలు జరుగుతున్నాయి. 

Updated Date - 2020-05-08T21:43:29+05:30 IST