ఏకగ్రీవంగా ఐఎంఏ కార్యవర్గం ఎన్నిక
ABN , First Publish Date - 2020-11-03T10:11:53+05:30 IST
‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్-వరంగల్’ అధ్యక్షుడిగా డాక్టర్ పి.సుధీర్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ నల్లా సురేందర్‌రెడ్డి సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు
హన్మకొండ అర్బన్ నవంబర్ 2 : ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్-వరంగల్’ అధ్యక్షుడిగా డాక్టర్ పి.సుధీర్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ నల్లా సురేందర్‌రెడ్డి సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఐఎంఏ కార్యవర్గానికి ఈ నెల 8న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సందర్భంగా పోటీదారులు వైదొలగడంతో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అధ్యక్ష పదవికి పోటీలో నిలిచిన ఇద్దరిలో కూరపాటి రమేశ్ వైదొలగడంతో డాక్టర్ పి.సుధీర్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో నిలిచిన వారిలో బి.రాజ్‌మోహన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డాక్టర్ బి.ప్రభాకర్ ఎన్నికయ్యారు. మిగతా పదవులకు కూడా ఉపసంహరణలు కొనసాగడంతో కార్యవర్గమంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయింది. కోశాధికారిగా డాక్టర్ బి.రాజ్‌మోహన్, ఉపాధ్యక్షురాలిగా (మహిళా విభాగం) డాక్టర్ పి.రజని, అర్బన్ విభాగంలో డాక్టర్ మన్మోహన్‌రాజు, రూరల్‌లో డాక్టర్ యాదగిరిరెడ్డి ఎన్నికయ్యారన్నారు. సంయుక్త కార్యదర్శులుగా మహిళా విభాగంలో డాక్టర్ ఎ.జ్యోతి, అర్బన్‌లో డాక్టర్ బింగి శ్రీనివాస్, రూరల్‌లో డాక్టర్ మల్లికార్జున్ ఎన్నికయ్యారు. తెలిపారు. ఈ ఎన్నికలకు కో-రిటర్నింగ్ అధికారులుగా డాక్టర్ ఆనంద్ బోక్రే, డాక్టర్ ప్రవీణ్ వ్యవహరించారు. అధ్యక్షుడు డాక్టర్ పి.సుధీర్‌కుమార్ ఆర్థోపెడిక్ వైద్యుడిగా, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.ప్రభాకర్ న్యూరో సర్జన్‌గా, కోశాధికారి డాక్టర్ బి.రాజ్‌మోహన్ న్యూరోసర్జన్(ఎంజీఎం)గా పని చేస్తున్నారు.