ఓటుకు నోటు కేసులో ఉదయ్‌సింహా అరెస్టు

ABN , First Publish Date - 2020-12-17T09:07:38+05:30 IST

ఓటుకు నోటు కేసులో ఉదయ్‌సింహా అరెస్టు

ఓటుకు నోటు కేసులో ఉదయ్‌సింహా అరెస్టు

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ఏ-3గా ఉన్న రుద్ర ఉదయ్‌సింహాను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్ట్‌ చేశారు. రాజకీయ నాయకులపై నమోదైన కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక కోర్టు ఓటుకు నోటు కేసులో విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర, సెబాస్టియన్‌ మంగళవారం విచాణకు హాజరయ్యారు. ఉదయ్‌సింహా హాజరు కాలేదు. మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దానిని తిరస్కరించిన న్యాయస్థానం.. ఉదయ్‌సింహాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

Updated Date - 2020-12-17T09:07:38+05:30 IST