తెలంగాణకు రెండు ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డులు

ABN , First Publish Date - 2020-09-14T09:35:04+05:30 IST

జాతీయ సేవా పథకం (ఎన్‌ఎ్‌సఎ్‌స)లో తెలంగాణ రాష్ట్రానికి రెండు జాతీయ అవార్డులు లభించాయి. కరీంనగర్‌ జిల్లా

తెలంగాణకు రెండు ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జాతీయ సేవా పథకం (ఎన్‌ఎ్‌సఎ్‌స)లో తెలంగాణ రాష్ట్రానికి రెండు జాతీయ అవార్డులు లభించాయి. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన ఉప్పు ఆదిత్య, సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన టి.విద్యాసాగర్‌ 2018-2019 సంవత్సరానికిగాను జాతీయ అవార్డులకు ఎంపికైనట్టు భారత ప్రభుత్వ యువజన వ్యవ హారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సెక్రటరీ రవి కుమార్‌ సేన మెయిల్‌ ద్వారా తెలిపారు. ఎన్‌ఎ్‌సఎ్‌స ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డులను ప్రదానం చేయనున్నారు. జాతీయ స్థాయిలో 30 మందికి అవార్డులు ప్రకటించగా.. తెలంగాణకు రెండు అవార్డులు దక్కడం గర్వకారణమని రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మూడు జాతీయ అవార్డులు దక్కాయి. ఆదిత్య ఇంటర్‌, డిగ్రీ చదువుతున్నప్పుడు ఎన్‌ఎ్‌సఎస్‌ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన సమైక్యత శిబిరాలు, సాంస్కృతిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈయన బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసుకుని పీజీ ఎంట్రన్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. విద్యాసాగర్‌ హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ కళాశాలలో ఆర్థిక శాస్త్రం చదువుతున్నారు. విద్యాసాగర్‌ 2014 నుంచి ఎన్‌ఎ్‌సఎ్‌సలో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తలసేమియా బాధితులు కోసం జాతీయ స్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం, పాఠశాల విద్యార్థులకు సహాయపడటం, అభాగ్యులకు భోజనం, అల్పాహారం అందించడం, ప్రభుత్వ పథకాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. విద్యాసాగర్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎన్‌ఎ్‌సఎ్‌స అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.  

Updated Date - 2020-09-14T09:35:04+05:30 IST