మాస్క్ ధరించని ఇద్దరికి జరిమానా
ABN , First Publish Date - 2020-05-29T14:59:28+05:30 IST
మాస్క్ ధరించని ఇద్దరికి జరిమానా

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కొవిడ్ నిబంధనలను అతిక్రమించిన రెండు షాపుల యజమానులకు పెద్ద అంబర్పేట మునిసిపల్ అధికారులు జరిమానా విధించారు. కుంట్లూరులోని బాలాజీ కిరాణా షాపు, బాలాజీ స్వీట్ హౌస్ యజమాని మాస్క్ ధరించకుండా అమ్మకాలు జరుపుతున్నారు. శానిటేషన్ విభాగం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ హనుమాన్ప్రసాద్ ఒక్కో షాపు యజమానికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. మునిసిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు నిబంధనలు అతిక్రమించిన 10 షాపులకు జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.