ఇద్దరు మావోయిస్టు కొరియర్లు అరెస్టు

ABN , First Publish Date - 2020-03-19T10:39:09+05:30 IST

సీపీఐ మావోయిస్టు పార్టీ కొరియర్లుగా పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు శివారులో పోలీసులు అరెస్టు

ఇద్దరు మావోయిస్టు కొరియర్లు అరెస్టు

భద్రాచలం, మార్చి 18: సీపీఐ మావోయిస్టు పార్టీ కొరియర్లుగా పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు శివారులో పోలీసులు అరెస్టు చేశారు.  ఏఎస్పీ రాజే్‌షచంద్ర వివరాలు వెల్లడించారు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అది చూసిన ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నారన్నారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన కొన్ని వాల్‌పోస్టర్లు లభ్యమయ్యాయన్నారు. పట్టుబడిన వారు శ్యామల రవి, కణితి వెంకటేశర్లని విచారణలో తేలిందన్నారు. 

Updated Date - 2020-03-19T10:39:09+05:30 IST