చెరువులో పడి ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2020-03-27T11:28:15+05:30 IST
గేదెలకు నీరు తాగించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదశాత్తు చెరువులో పడి మృతి చెం దిన ఘటన గురువారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. టేక్రియాల్‌కు చెందిన మద్దికుంట
కామారెడ్డి, మార్చి26: గేదెలకు నీరు తాగించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదశాత్తు చెరువులో పడి మృతి చెం దిన ఘటన గురువారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. టేక్రియాల్‌కు చెందిన మద్దికుంట రాణదీప్(18), మద్దికుంట రాజశేఖర్(18) గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో గేదెలకు నీరు తాగించేందుకు తోలుకెళ్లారు. చెరువులోకి దిగిన తరువాత గేదెలు మరింత లోతుకు వెళ్తుండడంతో వాటిని మళ్లించేందుకు ఇద్దరూ యత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయారు.