విద్యుత్‌ షాక్‌తో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-06-26T08:29:09+05:30 IST

విద్యుత్‌ షాక్‌తో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి

విద్యుత్‌ షాక్‌తో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి

షాద్‌నగర్‌ అర్బన్‌: విద్యుత్‌ షాక్‌తో బాబాయి, అబ్బాయి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్ద గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాండ్ల సురేష్‌ (46), ఆయన అన్న కుమారుడైన అభిలాష్‌ (20) గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్లారు. బోరుబావిని మరమ్మతు చేస్తుండగా.. బోరుపై ఉన్న హెచ్‌టీ విద్యుత్‌ లైనుకు పైపు తగిలింది. దీంతో వారిద్దరూ విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. వరుసకు తండ్రీకొడుకులైన ఇద్దరూ మరణించడంతో వారి కుటుంబాల్లో, మొగిలిగిద్ద గ్రామంలోనూ తీవ్ర విషాదం నెలకొంది. మృతుడు సురే్‌షకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అభిలాష్‌ డిగ్రీ రెండో సంవత్సరం పూర్తి చేశాడు. 

Updated Date - 2020-06-26T08:29:09+05:30 IST