భద్రాద్రి జిల్లాలో ఇద్దరు బాలికలపై అత్యాచారం
ABN , First Publish Date - 2020-12-05T08:39:13+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గుండాల మండలానికి చెందిన

గుండాల/పాల్వంచరూరల్, డిసెంబరు 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గుండాల మండలానికి చెందిన ఓ వ్యక్తి తమ గ్రామానికే చెందిన బాలిక(12)ను తన ఇంట్లోకి పిలిచి, భయపెట్టి మూడు రోజుల క్రితం అత్యాచారం చేశాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాల్వంచ మండలంలోని ఓ కాలనీలో నివాసముంటున్న ఓ బాలిక(15)కు మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆపై బెదిరించి ఆత్యాచారం చేశాడు. అనంతరం ఇంటికి చేరుకున్న బాలిక శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.