చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2020-03-13T11:50:34+05:30 IST

దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పేరూరు ఎస్సై హరికృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 29న

చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

వాజేడు, మార్చి 12: దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పేరూరు ఎస్సై హరికృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 29న మండలంలోని ధర్మవరంలో ఎరువుల దుకాణంలో రూ.25వేల దొంగతనం జరిగింది. దుకాణదారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. బుధవారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు టేకులగూడెం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఛత్తీ్‌సగఢ్‌ వైపు నుంచి జీపులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు పోలీసులను చూసి జీపులో నుంచి దూకి పారిపోవడానికి యత్నించగా పట్టుకుని వారిని ధర్మవరానికి చెందిన గార ఏసుబాబు, ముక్కెర సమ్మయ్యగా గుర్తించారు. కాగా అదే గ్రామానికి చెందిన సయ్యద్‌ జమీల్‌ ఈ దొంగతనానికి పథకం రచించినట్లు ఎస్సై తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు.  పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.15వేలను రికవరీ చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-13T11:50:34+05:30 IST