చాడ వాహనంపై దాడి చేసిన ఇద్దరు అరెస్ట్
ABN , First Publish Date - 2020-09-16T22:35:12+05:30 IST
సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వాహనంపై దాడి చేసిన ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులకు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించారు. స్నేహితుడి వాహనం అనుకోని దాడి

హైదరాబాద్: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వాహనంపై దాడి చేసిన ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులకు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించారు. స్నేహితుడి వాహనం అనుకోని దాడి చేశానని నిందితుడు శుక్లా చెబుతున్నాడు. గతేడాది మతిస్థిమితం సరిగా లేక 5 నెలలు శుక్లా చికిత్స తీసుకున్నాడు. విచారణ అనంతరం నిందితులను నారాయణగూడ పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు.