అటు అమ్మాయిలు... ఇటు అబ్బాయిలు కవలలే

ABN , First Publish Date - 2020-12-11T05:07:35+05:30 IST

అటు అమ్మాయిలు... ఇటు అబ్బాయిలు కవలలే

అటు అమ్మాయిలు... ఇటు అబ్బాయిలు కవలలే
వెంకటగిరిలో ఒక్కటైన కవల వధువు, వరులు

మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంటలు


కేసముద్రం, డిసెంబరు 10 : అన్నాదమ్ములు మరో ఇంటికి చెందిన అక్కాచెళ్లెలను వివాహం చేసుకోవడం  సాధారణంగా జరిగేవే...ఇందుకు భిన్నంగా కవలలైన అన్నదమ్ములు, కవలలైన అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న అరుదైన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలో గురువారం జరిగింది. వెంకటగిరి గ్రామానికి చెందిన అంబాల మల్లికార్జున్‌, సుజాత దంపతులకు పెద్ద కుమారుడు శరత్‌, ఆ తర్వాత కవలలు మహే్‌ష,నరే్‌షలు సంతానం. వీరు డిగ్రీ పూర్తి చేసి తండ్రికి వ్యవసాయంలో సహాయంగా ఉంటూ చిన్న కిరాణం దుకాణం నడుపుకుంటున్నారు. హైదరాబాద్‌లో మధ్య తరగతికి చెందిన నేరెళ్ల వీరభద్రం, మంగమ్మ దంపతులకు ఒక కుమార్తె తర్వాత శాంతి, ప్రశాంతి కవలలు సంతానం. వెంకటగిరికి చెందిన కవల సోదరులకు, హైదరాబాద్‌కు చెందిన కవల సోదరీమణులతో ఇటీవలె నిశ్చితార్థం కుదుర్చుకున్నారు. మహే్‌షకు శాంతితో, నరే్‌షకు ప్రశాంతితో వరుళ్ల ఇంటివద్దనే వివాహం జరిపించారు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు కవలలైన రెండు జంటల దంపతులను ఆసక్తిగా గమనించి ఆశీర్వదించారు.

Updated Date - 2020-12-11T05:07:35+05:30 IST