‘పసుపు లారీ’ దగ్ధం

ABN , First Publish Date - 2020-03-13T10:47:46+05:30 IST

పసుపు లోడుతో వెళ్లున్న లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ఘటన గురువారం నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. మెండోర మండలం వెల్కటూర్‌ నుంచి 294 పసుపు బస్తాల లోడ్‌తో నిజామాబాద్‌ మార్కెట్‌కు వెళ్తున్న

‘పసుపు లారీ’ దగ్ధం

ముప్కాల్‌, మార్చి 12: పసుపు లోడుతో వెళ్లున్న లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ఘటన గురువారం నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. మెండోర మండలం వెల్కటూర్‌ నుంచి 294 పసుపు బస్తాల లోడ్‌తో నిజామాబాద్‌ మార్కెట్‌కు వెళ్తున్న లారీ ముప్కాల్‌ మండలంలోని కొత్తపల్లి శివారుకు చేరుకోగానే డీజిల్‌ ట్యాంక్‌ నుంచి ఇంధనం లీకై మంటలు చెలరేగాయి. వాహనాన్ని అగ్ని కీలలను ఆర్పేందుకు యత్నించిన డ్రైవర్‌, క్లీనర్‌కు మంటలు అంటుకున్నాయి. ఫైర్‌ ఇంజన్‌ వచ్చేలోపే లారీ, అందులో ఉన్న పసుపు బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.20లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వే స్తున్నారు. వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవన అధికారులు ఘటనా స్థలంలో పంచనామా చేశారు.

Updated Date - 2020-03-13T10:47:46+05:30 IST