జగన్‌పై మండిపడ్డ టీటీడీపీ నేతలు

ABN , First Publish Date - 2020-10-07T20:24:14+05:30 IST

సీఎం జగన్‌పై టీటీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఏపీ టీడీపీ నేత పట్టాభిని ఆ పార్టీ తెలంగాణ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా నేతలు

జగన్‌పై మండిపడ్డ టీటీడీపీ నేతలు

విజయవాడ: సీఎం జగన్‌పై టీటీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఏపీ టీడీపీ నేత పట్టాభిని ఆ పార్టీ తెలంగాణ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతున్నారనే.. పట్టాభిపై దాడులు చేస్తున్నారని టీటీడీపీ నేత నరసింహులు మండిపడ్దారు. ప్రభుత్వ అరాచకాలకు పోలీసులు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు తమకు నేర్పిన సంస్కృతి వల్లే తాము దాడులు చేయడం లేదని, బూతులు తిట్టడం లేదని చెప్పారు. అమరావతిని మారిస్తే జగన్ చరిత్ర హీనులుగా మారతారని నరసింహులు హెచ్చరించారు. పట్టాభిని భయపెట్టాలనే ఆయన కారుపై దాడి చేశారని టీటీడీపీ నేత లక్ష్మణ్‌నాయక్‌ ఆరోపించారు. పట్టాభి ఇంకా ఉత్సహంతో ప్రభుత్వంపై పోరాటం చేస్తారని, ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? రాచరిక పాలన నడుస్తోందా? అని లక్ష్మణ్‌నాయక్‌ ప్రశ్నించారు. కారులో పట్టాభి ఉంటే ఆయన్ని హత్య చేసేవారని, హిట్లర్‌లాంటి వారే పోయారు.. జగన్‌ ఎంత? అని  టీటీడీపీ నేత దుర్గాప్రసాద్‌ ప్రశ్నించారు. ఏపీలో ప్రజలకు, దేవుళ్లకు కూడా రక్షణ లేదని దుర్గాప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Read more