టీఎ‌స్‌ఐఐసీకి భూమి ఇవ్వం

ABN , First Publish Date - 2020-12-17T08:27:56+05:30 IST

‘ఇప్పటికే పరిశ్రమల ఏర్పాటు పేరిట 1,600 ఎకరాల భూములను మా నుంచి తీసుకున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ సెంటు భూమి కూడా తెలంగాణ

టీఎ‌స్‌ఐఐసీకి భూమి ఇవ్వం

గ్రామస్థుల నిరసన.. వెనుదిరిగిన అధికారులు


చౌటుప్పల్‌ రూరల్‌, డిసెంబరు 16: ‘ఇప్పటికే పరిశ్రమల ఏర్పాటు పేరిట 1,600 ఎకరాల భూములను మా నుంచి తీసుకున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ సెంటు భూమి కూడా తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయల కల్పన సంస్థకు ఇచ్చే ప్రసక్తే లేదు’ అని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామస్థులు, రైతులు తేల్చిచెప్పారు. దండు మల్కాపురంలో ఫర్నిచర్‌ ఇండస్ర్టియల్‌ పార్కు ఏర్పాటు చేస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 753, 754, 755, 758లోని భూముల్లో పార్క్‌ ఏర్పాటుకోసం అధికారులు ప్రతిపాదించారు. బుధవారం ఈ భూములను టీఎ్‌సఐఐసీ, రెవెన్యూ అధికారులు పరిశీలించేందుకు వెళ్లటంతో గ్రామస్థులు నిరసన వ్యక్తం చేసి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు వెనుదిరిగారు.  

Updated Date - 2020-12-17T08:27:56+05:30 IST