టీఎస్​–బిపాస్​ మంత్రి వర్గం ఆమోదం తర్వాతే ఆచరణలోకి వస్తుంది: పురపాలక శాఖ

ABN , First Publish Date - 2020-05-31T01:33:22+05:30 IST

టీఎస్​–బిపాస్​ మంత్రి వర్గం ఆమోదం తర్వాతే ఆచరణలోకి వస్తుంది: పురపాలక శాఖ

టీఎస్​–బిపాస్​ మంత్రి వర్గం ఆమోదం తర్వాతే ఆచరణలోకి వస్తుంది: పురపాలక శాఖ

హైదరాబాద్: టీఎస్​-బిపాస్​ ట్రయల్​ మాత్రమే అని, రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తర్వాతే ఆచరణలోకి వస్తుందని పురపాలక శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కొత్త మున్సిపల్​ చట్టం–2019 లోబడి స్థానిక సంస్థలకు(మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్లు) ఇచ్చిన అధికారాలలో భాగంగా పట్టణ ప్రణాళికలు, భవన నిర్మాణ అనుమతులు, లేఔట్​ అనుమతులు స్థానిక సంస్థలే నిర్వహిస్తాయని పురపాలక శాఖ తెలిపింది.

 జూన్​ 2వ తేదీ నుంచి అమలులోకి రావాల్సిన టీఎస్​–బిపాస్​ విధానాన్ని రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తర్వాత ఆచరణలో అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. అప్పటి వరకు(ప్రస్తుతం) టీఎస్​–బిపాస్​ ప్రక్రియ ప్రయోగాత్మకంగా(ట్రయల్​ టెస్టింగ్​) కొనసాగుతుందని పేర్కొంది. టీఎస్​–బిపాస్​ కు సంబంధించిన సాఫ్ట్​ వేర్​(సాఫ్ట్​ వేర్​ అప్లికేషన్​) పురోగతిలో ఉందని, వివిధ ప్రభుత్వ విభాగాల(శాఖల) మధ్య అనుసంధాన ప్రక్రియతో పాటు ప్రభుత్వ స్థలాలు, నిషేదిత సర్వే నెంబర్ల వివరాలు తదితర అంశాలను పొందుపరిచే ప్రక్రియ ఇంకా పురోగతిలో ఉందని పురపాలక శాఖ తెలిపింది.

Updated Date - 2020-05-31T01:33:22+05:30 IST