సీఎం కేసీఆర్‌ను కలిసిన మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి
ABN , First Publish Date - 2020-12-29T01:25:53+05:30 IST
తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్‌గా నియమితులైన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.

హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్‌గా నియమితులైన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఆమెతో పాటు కమిషన్‌సభ్యులు గడ్డాల పద్మ, రేవతి రావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షబీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి ఉన్నారు. ఈసందర్భంగా వారు తమ నియామకం పట్ల ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌వారికి అభినందనలు తెలిపారు.