21న ధర్నా:తెలంగాణ ఉద్యోగుల సంఘం
ABN , First Publish Date - 2020-12-20T12:37:46+05:30 IST
21న ధర్నా:తెలంగాణ ఉద్యోగుల సంఘం

హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): వేతన సవరణ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 21న భోజన విరామ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. మూడు నెలల్లో చేస్తామన్న వేతన సవరణ.. 31 నెలలు గడుస్తున్నా అమలు కాలేదని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సి.సంపత్‌కుమార్, డాక్టర్ పి.పురుషోత్తం అన్నారు.