పెన్షనర్లకు నేటి నుంచి తుదివాయిదా చెల్లింపు
ABN , First Publish Date - 2020-11-21T10:09:40+05:30 IST
కొవిడ్ సమయంలో పెన్షనర్లకు కోత విధించిన బకాయిల చెల్లింపు తుది వాయిదాను శనివారం నుంచి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ సమయంలో పెన్షనర్లకు కోత విధించిన బకాయిల చెల్లింపు తుది వాయిదాను శనివారం నుంచి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా పెన్షనర్లకు వేతనాల్లో కోత విధించిన విషయం విదితమే. అందులో కోత పెట్టిన పెన్షన్ బకాయిలను రెండు వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. అందులో తొలి వాయిదాను అక్టోబరు 23వ తేదీన చెల్లించిన విషయం విదితమే. మిగిలిన ఒక వాయిదాను చెల్లించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.56 లక్షలమంది పెన్షనర్లు ఉన్నారు. మూడు, నాలుగు రోజుల్లో బకాయిల చెల్లింపు పూర్తవుతుందని పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య తెలిపారు.