ఆర్టీసీ స్టాళ్ల అద్దెలు మాఫీ చేయాలి: తమ్మినేని
ABN , First Publish Date - 2020-08-12T09:27:50+05:30 IST
ఆర్టీసీ స్టాళ్ల అద్దెలు మాఫీ చేయాలి: తమ్మినేని

లాక్‌డౌన్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించలేకపోయినందున ఆర్టీసీ స్టాళ్ల అద్దెను మాఫీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో వ్యాపారాలు సజావుగా సాగనందున, ఆతర్వాత కాలానికి అద్దెలో రాయితీలు ఇవ్వాలని కోరారు.