ఈఎస్‌ఐలో ఖాళీలను భర్తీ చేయండి: జూలకంటి

ABN , First Publish Date - 2020-08-12T09:14:28+05:30 IST

ఈఎస్‌ఐలో ఖాళీలను భర్తీ చేయండి: జూలకంటి

ఈఎస్‌ఐలో ఖాళీలను భర్తీ చేయండి: జూలకంటి

హైదరాబాద్‌,ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఈఎ్‌సఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. కొన్ని నెలలుగా మందుల సరఫరా లేకపోవడంతో చికిత్స కోసం వెళ్లేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన సీఎం కేసీఆర్‌, మంత్రి మల్లారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా సరైన వైద్యసేవలు అందడం లేదని, ఇప్పటికైనా ఈ అంశాలపై దృష్టి సారించాలని కోరారు. 

Updated Date - 2020-08-12T09:14:28+05:30 IST