ఏడుగురికి రెండోసారి బూస్టర్ డోస్
ABN , First Publish Date - 2020-08-12T09:13:49+05:30 IST
ఏడుగురికి రెండోసారి బూస్టర్ డోస్

నిమ్స్‌లో శర వేగంగా కోవాక్సిన్ ప్రయోగం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో కోవాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండో సారి ఏడుగురికి బూస్టర్ డోస్ ఇచ్చారు. మరో 43 మందికి దశల వారీగా ఇవ్వనున్నారు. మొదటి సారి క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 50 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అందులో 14 రోజులు గడిచిన వారిలో కొందరిని ఎంపిక చేసి నిర్ధారిత సమయాల్లో బూస్టర్ డోస్ ఇస్తున్నారు. అందరి ఆరోగ్య పరిస్థితిని వీడియో కాల్ ద్వారా ప్రతి రోజూ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 24 గంటలపాటు ఆస్పత్రిలోనే ఉంచి..ఆరోగ్యం నిలకడగా ఉంటేనే ఇళ్లకు పంపిస్తున్నారు. రెండో డోసు తీసుకున్న ఏడుగురితో కలిపి మొదటి డోసు వేసుకున్న వారందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్య బృందం నిర్ధారించుకుంది.