‘ఆయుష్మాన్‌ భారత్‌’ లబ్ధిదారుల కొవిడ్‌

ABN , First Publish Date - 2020-08-12T09:12:41+05:30 IST

‘ఆయుష్మాన్‌ భారత్‌’ లబ్ధిదారుల కొవిడ్‌

‘ఆయుష్మాన్‌ భారత్‌’ లబ్ధిదారుల కొవిడ్‌

పరీక్షలకు అపోలో డయాగ్నస్టిక్స్‌ ఎంపిక 

8 ఎన్‌హెచ్‌ఏతో ఒప్పందంపై సంతకాలు


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 ఆర్టీ పీసీఆర్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అపోలో డయాగ్నస్టిక్స్‌కు చెందిన నేషనల్‌ రెఫరెన్స్‌ లేబొరేటరీకి ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీపీఎం-జేఏవై) ఎంప్యానెల్‌మెంట్‌ లభించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్మాన్‌ భారత్‌ లబ్ధిదారులు కొవిడ్‌-19 పరీక్షల కోసం అపోలో డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలను ఉచితంగా వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై నేషనల్‌ హెల్త్‌ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ జీతూలాల్‌ మీనా, అపోలో హెల్త్‌, లైఫ్‌స్టయిల్‌ లిమిటెడ్‌ (ఏహెచ్‌ఎల్‌ఎల్‌) గ్రూప్‌ సీఈవో చంద్రశేఖర్‌ సంతకాలు చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ యోజన గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న రోగులు అక్కడి వైద్యుల సూచన మేరకు అపోలో డయాగ్నస్టిక్‌ లేబొరేటరీలు, నేషనల్‌ రెఫరెన్స్‌ లేబొరేటరీల్లో పరీక్షలు చేయించుకోవచ్చని వారు వెల్లడించారు. 

Updated Date - 2020-08-12T09:12:41+05:30 IST