కొవిడ్ నిబంధనలను గాలికి వదిలేసిన మంత్రులు
ABN , First Publish Date - 2020-08-12T08:59:23+05:30 IST
కొవిడ్ నిబంధనలను గాలికి వదిలేసిన మంత్రులు

మాస్క్‌లు లేకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో తలసాని, అల్లోల
సోన్, ఆగస్టు 11 : కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో కూడా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు నిబంధనలను గాలికి వదిలేశారు. ప్రజలకు చెప్పవలసినవారే జాగ్రత్తలు పాటించడంలేదు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో మంగళవారం మంత్రులు ఇద్దరూ మాస్క్‌లు లేకుండానే పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎస్సారెస్పీలో చేప పిల్లలను విడుదల చేశారు. గొర్రెలకు వ్యాక్సిన్ వేశారు. ప్రజలు అనేక మంది గుంపుగా పాల్గొన్నా మంత్రులు మాత్రం మాస్క్‌లు ధరించలేదు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.