9నెలలుగా జీతాల్లేని విద్యా వలంటీర్లు: టీపీసీసీ

ABN , First Publish Date - 2020-08-12T08:59:00+05:30 IST

9నెలలుగా జీతాల్లేని విద్యా వలంటీర్లు: టీపీసీసీ

9నెలలుగా జీతాల్లేని విద్యా వలంటీర్లు: టీపీసీసీ

హైదరాబాద్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 16వేల మంది విద్యా వలంటీర్లకు గత ఏడాది డిసెంబరు నుంచి చెల్లించాల్సిన జీతాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి జి.హర్షవర్థన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనేక పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోయినా.. అన్నీతామై విద్యా వలంటీర్లు సేవలందిస్తున్నారని చెప్పారు. వారికి నెలల తరబడి వేతనం ఇవ్వకపోవడం సరికాదన్నారు. అలాగే.. అంతర జిల్లాల ఉపాధ్యాయులతోపాటు మోడల్‌ స్కూల్స్‌ ఉపాధ్యాయులకు బదిలీలు చేయాలన్నారు. 2015 నుంచి నిలిపివేసిన ఉపాధ్యాయుల పదోన్నతులను వెంటనే కల్పించాలని కోరారు. 

Updated Date - 2020-08-12T08:59:00+05:30 IST