‘మర్డర్’ సినిమా విచారణ 14కు వాయిదా
ABN , First Publish Date - 2020-08-12T08:51:38+05:30 IST
‘మర్డర్’ సినిమా విచారణ 14కు వాయిదా

మిర్యాలగూడ అర్బన్, ఆగస్టు 11: కరోనా సోకటంతో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కోర్టుకు రాలేకపోతున్నారన్న న్యాయవాది వివరణతో ‘మర్డర్’ సినిమా కేసు విచారణను నల్లగొండ జిల్లా కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు నేపథ్యంలో వర్మ ‘మర్డర్’ పేరిట సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ ప్రణయ్ భార్య అమృత జూలై 29న నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.