ఎంసెట్‌ రాయాలంటే రూ. 10వేలు కట్టాల్సిందే

ABN , First Publish Date - 2020-07-10T08:30:33+05:30 IST

ఎంసెట్‌ రాయాలంటే రూ. 10వేలు కట్టాల్సిందే

ఎంసెట్‌ రాయాలంటే రూ. 10వేలు కట్టాల్సిందే

హైదరాబాద్‌, జులై 9(ఆంధ్రజ్యోతి):  ఫెయిలైన ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులంతా ప్రభుత్వ నిర్ణయంతో ఉత్తీర్ణత సాధించామని సంతోషిస్తూ... మరోవైపు ఎంసెట్‌ పరీక్ష ఫీజు చూసి ఆందోళన చెందుతున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఎంసెట్‌ దరఖాస్తుకు రూ.10వేల ఆలస్య రుసుముతో జూన్‌30 వరకు గడువు విధించగా.. పరీక్ష వాయిదాతో దానిని ఈనెల 15వరకు పొడిగించారు. ప్రభుత్వ నిర్ణయంతో పాస్‌ అయిన ఇంటర్‌ విద్యార్థులు ఇప్పుడు ఎంసెట్‌కు దరఖాస్తు చేయాలంటే ఇంకా 6 గడువు రోజులు ఉన్నప్పటికీ.. ఆలస్య ఫీజు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయమై ఉన్నత విద్యామండలి అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. తామేమీ చేయలేమని బదులిచ్చారు. 

Updated Date - 2020-07-10T08:30:33+05:30 IST