ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు

ABN , First Publish Date - 2020-07-10T08:30:10+05:30 IST

ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు

ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు

ఏఐసీటీఈ ఉత్తర్వులు జారీ


హైదరాబాద్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌తో పాటు సాంకేతిక కళాశాలల్లో ప్రవేశాలు, తరగతుల ప్రారంభంపై ఏఐసీటీఈ ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులు, లేటరల్‌ ఎంట్రీ ద్వారా నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు పొందినవారికి  ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాలని గతంలో పేర్కొనగా.. దీనిని అక్టోబరు-15కి మార్చింది. అలాగే ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల తరగతుల ప్రారంభం గురించి ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు లేకపోగా.. తాజా ఉత్తర్వుల్లో తేదీలను ప్రకటించింది. ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల తరగతులు ఆగస్టు 17 నుంచి ప్రారంభించాలని  యునివర్సిటీలకు సూచించింది. పీజీడీఎం/పీజీసీఎం విద్యార్థుల తరగతులు ఈనెల 15 నుంచే ప్రారంభించాలని స్పష్టం చేసింది. కళాశాలల గుర్తింపును ఆగస్టు 15లోగా, మొదటి విడత కౌన్సెలింగ్‌ను అక్టోబరు 5, రెండోవిడత కౌన్సెలింగ్‌ను అక్టోబరు-15లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. 

Updated Date - 2020-07-10T08:30:10+05:30 IST