రెండో రోజూ నర్సుల ఆందోళన
ABN , First Publish Date - 2020-07-08T08:15:02+05:30 IST
రెండో రోజూ నర్సుల ఆందోళన

మంగళ్‌హాట్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) లో పనిచేసేందుకు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న నర్సులకు న్యాయం చేయాలని కోరుతూ రెండో రోజూ నర్సులు డీఎంఈ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు అని చెప్పి ఎంపిక ప్రక్రియ పూర్తైన తర్వాత ఔట్‌సోర్సింగ్‌లో పనిచేయాలని చెప్పడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం డీఎంఈ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో డీడీ ప్రేమ్‌కుమార్ నర్సులతో చర్చించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సులకు కల్పించే అన్ని సౌకర్యాలు ఔట్‌సోర్సింగ్‌లో కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన నర్సులు వెనుదిరిగారు.