లాఠీ పట్టిన మంత్రి... రోడ్డుపై తిరుగుతూ ప్రజలకు విజ్ఞప్తి
ABN , First Publish Date - 2020-03-25T20:43:33+05:30 IST
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా..

మహబూబ్ నగర్: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా.. చాలా మంది ఏదో ఒక పనిపై రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ప్రజలను నిలువరించడానికి ప్రజాప్రతినిధులు కూడా అంతేస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పక్క ఫొటోలో ఉన్నది మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్‌నగర్‌లో కనిపించిన దృశ్యం ఇది. లాఠీ చేతపట్టిన ఆయన రోడ్లపై తిరుగుతూ ఇళ్లలోనే ఉండాలంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. వచ్చే పోయే వాహనాలను ఎక్కడికక్కడ ఆపుతూ కరోనా వైరస్‌పై అవగాహన కలిగిస్తున్నారు. ఆయనతో పాటు అధికారులు, పోలీసులు, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

