కందుల కొనుగోలుకు నోడల్‌ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్‌

ABN , First Publish Date - 2020-03-14T01:52:50+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి రైతులు పండించిన కందులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు తెలంగాణ మార్క్‌ఫెడ్‌ను నోడల్‌ఏజెన్సీగా నియమించింది.

కందుల కొనుగోలుకు నోడల్‌ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి రైతులు పండించిన కందులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు తెలంగాణ మార్క్‌ఫెడ్‌ను నోడల్‌ఏజెన్సీగా నియమించింది. తెలంగాణ మార్క్‌ఫెడ్‌ రాష్ట్రవ్యాప్తంగా 104 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్కెట్‌ ధర మద్దతు ధరకన్నాతక్కువ ఉన్నందున మధ్యదళారులు మార్కెట్‌లో కందులను అమ్మే అవకాశం వుంది. ఈక్రమంలో విజిలెన్స్‌అండ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నల్గొండ, సూర్యాపేట కందుల కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు జరిపారు. రైతుల పొలాల్లో విఆర్‌వోలు, ఎఈవోలు ఈ తనిఖీలు చేశారు. సరిగ్గా క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండానే పంట ధృవీకరణ పత్రాలు అందజేసినట్టు పరిశీలనలో తేలిన సందర్భంగా సంబంధిత అధికారులపై వ్యవసాయశాఖకు శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారులకు వ్యవసాయశాఖ కమిషనర్‌ ఆదేశించారు. పంట ధృవీకరణ పత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిందిగా సూచించారు. 

Updated Date - 2020-03-14T01:52:50+05:30 IST