తెలంగాణ ఎంసెట్.. మెడికల్ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-10-24T21:21:35+05:30 IST

తెలంగాణ ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ ఫలితాలు విడుదలయ్యాయి. కుకట్‌పల్లి జేఎన్టీయూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను..

తెలంగాణ ఎంసెట్.. మెడికల్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ ఫలితాలు విడుదలయ్యాయి. కుకట్‌పల్లి జేఎన్టీయూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 28, 29 తేదీలలో రెండు సెషన్లలో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 78,981మంది విద్యార్థులు ఈ పరీక్షకు అప్లై చేసుకున్నారు. 80.85 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయాగా ... ఉత్తీర్ణతా శాతం 92.57శాతంగా ఉంది. tseamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలు, ర్యాంక్ కార్డ్స్ అందుబాటులో ఉంటాయి. తొలి మూడు ర్యాంకులు అమ్మాయిలు సాధించారు. 


టీఎస్ ఎంసెట్ 2020: మెడికల్ & అగ్రికల్చర్ విభాగంలో తొలి పది ర్యాంకులు వీరివే.. 


1. గుత్తి చైతన్య సింధు (ఏపి విద్యార్థి)

2. మారెడ్డి సాయి త్రిషా రెడ్డి (అమీన్ పూర్ విద్యార్థి)

3. తుమ్మల స్నికిత (మెడికల్ ఆల్ ఇండియా లెవెల్ లో 3వ ర్యాంకు సాధించిన విద్యార్థిని, మంచిరేవుల, హైదరాబాద్)

4. దర్శి విష్ణు సాయి (ఎన్.జి.ఓ కాలనీ నెల్లూరు)

5. మల్లిడి రిషిత్ (ఎన్.టి.ఆర్ సర్కిల్, ఖమ్మం)

6. శ్రీమల్లిక్ చిగురుపాటి(వివి నగర్, కూకట్‌పల్లి)

7. ఆవుల‌ సుభాన్ (గచ్చిబౌలి)

8. గారపాటి గుణ చైతన్య (కృష్ణా నగర్, కర్నూలు)

9. గిండేటి వినయ్ కుమార్ (చిత్తూరు)

10. కోట వెంకట్ (ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా)


Updated Date - 2020-10-24T21:21:35+05:30 IST