శరవేగంగా ‘యాదాద్రి’ పనులు

ABN , First Publish Date - 2020-03-15T10:37:46+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం ఊపందుకుంది. ఈ మేరకు వైటీడీఏ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.

శరవేగంగా ‘యాదాద్రి’ పనులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం ఊపందుకుంది. ఈ మేరకు వైటీడీఏ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఆలయ అభివృద్ధి పనుల నిర్మాణ సంస్థలు, శిల్పి కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయిలు పడడడంతో కొంతకాలంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం బడ్జెట్‌లో ఆలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించారు. అందులో యాదాద్రి క్షేత్రానికే రూ.350కోట్లు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థలకు బిల్లుల బకాయిల చెల్లింపులు జరపడమే గాక,  నిర్మాణం పూర్తికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఆలయ ఆర్కిటెక్చర్‌ ఆనందసాయి, 

వైటీడీఏ స్థపతి ఆనందచారివేలు తదితరులు శనివారం  పనులను పరిశీలించారు.  - యాదాద్రి

Updated Date - 2020-03-15T10:37:46+05:30 IST