సాగర్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-10-12T10:12:12+05:30 IST

సాగర్‌కు కొనసాగుతున్న వరద

సాగర్‌కు కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్‌, అక్టోబరు11: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఆదివారం కూడా కొనసాగింది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా ఇన్‌ఫ్లో పెరగడంతో ఒక గేటును ఎత్తి, కుడిగట్టు విద్యుత్తు కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తూ సాగర్‌కు 18,433 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 588.90అడుగులు(308.7 టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి మొత్తం 18,433 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి అంతే మొత్తంలో నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటి మట్టం 884.90 అడుగులుగా ఉంది. ఆదివారం సెలవుదినం కావడంతో నాగార్జునసాగర్‌లో సందడి నెలకొంది. 

Updated Date - 2020-10-12T10:12:12+05:30 IST