టీడీపీకి తెలుగు యువత వెన్నెముక: రమణ

ABN , First Publish Date - 2020-10-12T10:09:13+05:30 IST

టీడీపీకి తెలుగు యువత వెన్నెముక: రమణ

టీడీపీకి తెలుగు యువత వెన్నెముక: రమణ

హైదరాబాద్‌, అక్ట్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): టీడీపీకి తెలుగుయువత వెన్నెముక అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను సీఎం కేసీఆర్‌ పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఇచ్చిన భృతి, ఖాళీల భర్తీని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఆదివారం ఎన్టీఆర్‌భవన్‌లో కార్యకర్తలకు నాయకత్వ లక్షణాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము క్రియాశీల పాత్ర పోషించనున్నట్లు తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జైరాంచందర్‌  తెలిపారు.  

 

Updated Date - 2020-10-12T10:09:13+05:30 IST